Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస, కెేవీపీఎస్్, టీజీఎస్ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుటధర్నా
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న కూలీలను కులాల వారిగా విభజన చేసి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుండి వేతనాలు చెల్లించే విధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 301011/ 13 /2020 ఆర్ఈ(వి) 371606 ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి సిరిపంగి స్వామి, గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ దరవత్ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు,వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా 2005లో గ్రామీణ ప్రజలందరికీ పని గ్యారంటి కల్పించడానికి ఆనాటి ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ వందరోజుల పని కల్పిస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రధానంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం లింగ వివక్ష లేకుండా ఆడ, మగ తేడాలేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఆర్థిక ,సామాజిక అంతరాలను తొలగించి స్థిర ఆస్తులు లక్ష్యంగా చట్టాన్ని అమలు చేయాలని ఈ చట్టం రూపొందించారన్నారు. కానీ నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉపాధి హామీ చట్టం మౌలిక స్ఫూర్తికి భిన్నంగా కూలీలను కులాల వారీగా విభజన చేసి ఎస్సీ ,ఎస్టీలకు సబ్ ప్లాన్ నుండి వేతనాలు చెల్లించే విధంగా జీవోను తీసుకు రావడం దుర్మార్గమన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కులమతాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతంలో కలిసి ఉంటున్న పేదలు, కార్మికుల మధ్య కుల వివక్ష పెంచి పోషించే విధంగా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించి, రోజు కూలి రూ.600 ర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లెర్ల ఆంజనేయులు జిల్లా కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, బండారి శ్రీరాములు,గాడి శ్రీనివాస్, కెేవీపీఎస్్ నాయకులు నిలికొండ కిషోర్,గిరిజన సంఘం నాయకులు భానోత్ వినోద్ పాల్గొన్నారు.