Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
మండలంలో బృహత్ పల్లెప్రకృతివనం పనులను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు.సోమవారం మండలంలోని కొరటికల్ గ్రామంలో సర్వే నంబర్ 523 లో గల 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతున్న బహత్పల్లెప్రకృతివనం పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు.గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న మెగా పల్లెప్రకతి వనాలు పార్కులను తలపించేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు.రకరకాల మొక్కలను నాటి గ్రామ ప్రజలకు మంచి వాతావరణాన్ని అందివ్వాలని సూచించారు. పిల్లలు, వద్ధులు, విద్యార్థులు, యువకులు ఈ ప్రకతివనాల్లో సేదతీరేందుకు ఎంతో దోహద పడతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాకుబ్‌నాయక్, ఎంపీఓ సుమలత, ఏపీఓశ్రీనయ్య, సర్పంచ్ వల్లూరి పద్మ లింగయ్య, ఇన్చార్జి గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ ఎల్లంకి యాదగిరి పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి :మండలపరిధిలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో నిర్మించనున్న బహత్ పల్లెప్రకతివనం పనులను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి కాళిందిని ఆదేశించారు. సోమవారం ఆ గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను, బృహత్పల్లెప్రకృతివనాన్ని సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహత్ ప్రకతివనం పనులు త్వరితగతిన పూర్తిచేసి మొక్కలు నాటి వాటిని సంరక్షించుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాంబశివరావు,ఏపీఓ యాదయ్య, ఈసీరాంబాబు, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు రామస్వామి, నాగమణి పాల్గొన్నారు.