Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకో రకంగా చోరీలు
- పట్టుకోవడంలో పోలీసులు విఫలం
నవతెలంగాణ-బొమ్మలరామారం
గత కొన్ని రోజులుగా మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బొమ్మలరామారం గ్రామంలో వరుసగా నాలుగిళ్లలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి కూడా కాజీపేట గ్రామంలో ఓ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన దొంగల వినికిడి గమనించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. కానీ అప్పటికే దొంగలు పరారయ్యారు. ఆదివారం రాత్రి మండలంలోని మర్యాల గ్రామంలో పార్కింగ్ చేసి ఉన్న టిప్పర్ ,లారీల డీజిల్ ట్యాంకర్ ను ఓపెన్ చేసి సుమారు 6500 లీటర్ల డీజిల్‌ను దొంగలించారు. మర్యాల గ్రామానికి చెందిన ఈదులకంటి జంగారెడ్డి, ముత్యాల రాజు రెడ్డి లకు సంబంధించిన టిప్పర్ లారీలను పెట్రోల్ బంక్ వద్ద ఒకటి గ్రామంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ వద్ద పార్కింగ్ చేశారు. లారీలలోని డీజిల్ ను అర్ధ రాత్రి దొంగిలించారు. గతంలో కూడా ట్రాన్స్‌ఫాÛర్మర్స్, వైర్ల దొంగతనాలు,గొర్లు, మేకలు వంటి దొంగతనాలు జరగడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేశారు బాధితులు. పోలీసులు రావడం క్లూస్ టీమ్ సహాయంతో వివరాలు సేకరించడం వెళ్లిపోవడం షరా మాములుగా మారిందని వాపోతున్నారు. కొంత మంది కొత్త వ్యక్తులను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించి అప్పజెప్పడంతో పోలీసులు స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించి పంపించే యడం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద వరస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడం లో మాత్రం పోలీసులు విఫలం అవుతున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.గత కొన్ని రోజులుగా దొంగ తనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.