Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ - కోదాడరూరల్
అర్హులందరికీ ఆహారభద్రత కార్డులను రాష్ట్రం అందిస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని ఆర్ఎస్వీ ఫంక్షన్హాల్లో లబ్దిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. గడపగడపకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కొత్త రేషన్ కార్డు పొందిన లబ్దిదారులకు ఆగస్టు నెల నుంచి రేషన్ సరుకులు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మెన్ సుధారాణిపుల్లారెడ్డి, వైస్ చైర్మెన్ వెంపటి పద్మ మధుసూదన్, ఎంపీపీ చింత కవితారాధారెడ్డి, జెడ్పీటీసీ కృష్ణకుమారిశేషు, తహసీల్దార్ శ్రీనివాస్‌శర్మ, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు చందు నాగేశ్వర్రావు, మండలాధ్యక్షులు భాస్కర్‌రావు, వైస్ చైర్మెన్ సంపేట ఉపేందర్, వైస్ ఎంపీపీ రాణి బ్రహ్మయ్య, ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, చైర్మెన్లు, డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.