Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ- నల్లగొండ
నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఉన్న భవన నిర్మాణ కార్మికుల నష్టపరిహారాలను నెల రోజుల్లోగా చెల్లించాలని,లేనిపక్షంలో లేబర్ ఆఫీస్‌ను మరోసారి ముట్టడిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు.యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు సభ్యులైన కార్మికులకు రావాల్సిన నష్టపరిహారాలను ఏఎల్ఓ పట్టించుకోకపోవడం వల్ల ఏండ్ల తరబడిగా పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. దీంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నా రన్నారు.కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న భవననిర్మాణ కార్మికులకు సంక్షేమబోర్డు ద్వారా ఆర్థికసాకారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కరోనా మృతి చెందిన కార్మికులకు రూ.10 లక్షలు, కరోనా బారిన పడిన వారికి రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు నర్సింహ, జిల్లా సహాయ కార్యదర్శి అద్దంకినర్సింహ, జిల్లా నాయకులు బి.గణేష్, యూనియన్ జిల్లా నాయకులు కె.కేశవులు, పి.ప్రసాద్, బైరం దయానంద్, బి.సైదులు, మల్లయ్య, ఇన్నయ్య, పరమేష్ పాల్గొన్నారు.