Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
రాష్ట్రంలో ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు.మంగళవారం మండలకేంద్రంలో 189 మంది లబ్దిదారులకు ఆయన నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆగస్టు ఒకటవ తేదీన ఎడమకాలువకు నీరు ఇవ్వనున్నట్టు తెలిపారు.ఉమ్మడి వేములపల్లి మండలంలోని సల్కునూరు నుండి మంగాపురం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టి ఆ రోడ్డు పాములపాడు గ్రామం వరకు త్వరలో డబుల్‌రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు లేనట్టయితే విషయాన్ని తన దృష్టికి తీసుకొస్తే వెంటనే విద్యుత్ లైన్ లాగే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పుట్టల సునీత, జెడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, సర్పంచ్ చిర్రమల్లయ్యయాదవ్, వైస్‌ఎంపీపీ పాదూరి గోవర్థనశశిధర్రెడ్డి, వేములపల్లి ఎంపీటీసీ చల్లబొట్ల చైతన్య ప్రణీత్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశం, పీఏసీఎస్ చైర్మెన్ జెర్రిపోతులరాములుగౌడ్, ఆర్ఐ సాయి, శ్రీధర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్‌కార్డులు
పెద్దవూర: అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.మండలకేంద్రంలోని మల్లికార్జున ఫంక్షన్‌హాలులో లబ్దిదారులకు ఆయన రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, జెడ్పీటీసీ అబ్బిడికృష్ణారెడ్డి పాల్గొన్నారు.
మండలఅభివృద్ధికి కృషి
మాడ్గులపల్లి: మూడు నియోజకవర్గాల గ్రామాలను కలుపుకొని నూతన మండలాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి పరుస్తామని ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్‌లు హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని ఫంక్షన్హాల్లో లబ్దిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో మండలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తామన్నారు. మూడు నియోజకవర్గాల నుండి గ్రామాలను కలుపుకొని ఒక మండలంగా ఏర్పాటు చేశారన్నారు. మండలంలో తహసీల్దార్, ఎంపీడీఓ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు.దీని గాను రూ.2 కోట్ల నిధులు త్వరలో మంజూరుచేస్తామన్నారు.ఈ కార్యక్ర మంలో ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు
రాష్ట్రాభివృద్ధి కోసమే సంక్షేమపథకాలు
కొండమల్లేపల్లి:సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం సంక్షేమపథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ అన్నారు.మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో 44 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందజేశారు.అనంతరం మార్కెట్‌యార్డులో లబ్దిదారులకు నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడు తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మెన్ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, జెడ్పీటీసీ పసునూరి సరస్వతమ్మ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కె.లింగారెడ్డి, దస్రునాయక్, తహసీల్దార్ సరస్వతి, ఉపసర్పంచ్ గంధం సురేష్, వి.కాశయ్య, మాడ్గులయాదగిరి, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.