Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూజిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ-బీబీనగర్
కాలపరిమితి ముగిసిన షెడ్యూల్డ్ ఎంప్లారుమెంట్ సంస్థల జీఓ 73 వెంటనే సవరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ వెంకట్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా కార్మికుల కనీస వేతనం రూ.21వేలుగా నిర్ణయించాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల కన్వీనర్ బండారు శ్రీరాములు, నాయకులు గాడి శ్రీనివాస్, మంద కిరణ్, షాజహాన్, గడ్డం శ్రీను, కట్ట రాజు పాల్గొన్నారు