Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
పాడిపశువుల పోషణకు పచ్చిమేతగా ఉపయోగించే నూతన హైబ్రిడ్ సూపర్ నేపియర్ పశుగ్రాస మొక్కలను పాడి రైతులకు పంపిణీ చేసినట్లు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఇన్చార్జి బి.లవకుమార్ తెలిపారు. మంగళవారం గడ్డిపల్లి కేవీకేలో సూపర్ నేపియర్ పశుగ్రాస మొక్కలను క్షేత్ర ప్రదర్శనలో భాగంగా ఐదుగురు రైతులకు పంపిణీ పశుగ్రాస ప్రత్యేకత గురించి వివరించారు.సూపర్ నేపియర్ పశుగ్రాసంలో పోషక విలువలు బాగా ఉంటాయన్నారు.దీన్ని పాడిపశువులకు మేతగా వాడినప్పుడు పాలదిగుబడి బాగా పెరుగు తుందన్నారు. సాధారణ పశుగ్రాసాలు చలికాలంలో సరిగ్గా పెరగకపోవడం తక్కువ పోషకాలు కల్గి ఉండడంతో ప్రత్యామ్నాయంగా సూపర్నేపియర్ హైబ్రిడ్ పశుగ్రాసాన్ని అభివద్ధి చేయడం జరిగిందన్నారు.పాడిరైతులు ఈ రకాన్ని సాగు చేసుకోవడం లాభదాయకంగా ఉంటుందన్నారు.ఈ రకం పశుగ్రాసాన్ని ఛౌడునేలల్లో తప్ప ఆరుతడి కల్గిన అన్ని రకాల నేలల్లో పెంచుకోవచ్చన్నారు.మొక్కలు నాటిన 75-85 రోజుల్లో మొదటిసారి కత్తిరింపు చేసు కోవచ్చ న్నారు.పశువుల ఎరువుతో పాటు, సింగిల్ సూపర్పాస్పేట్ ఎరువును వేసుకుంటూ పదిరోజులకోసారి నీటి తడులను ఇవ్వడం ద్వారా సంవత్సరానికి ఎకరాకు 200 టన్నులకు పైగా పశుగ్రాసాన్ని పొందవచ్చునని తెలిపారు.ఒకసారి నాటిన గడ్డిని జాగ్రత్తగా మధ్యలో దున్నుతూ చనిపోయిన దుబ్బులు తీసివేసి పెంచితే 5 నుంచి 8 ఏండ్ల వరకు పశుగ్రాసం పొందొచ్చన్నారు.ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామానికి చెందిన రైతులు ఎం. వెంకన్న, ఎల్.సాయికష్ణ, బి.రవి, సుధాకర్, నాగరాజు, బి.మనోజ్, ప్రభాకర్ పాల్గొన్నారు.