Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు.మంగళవారం పట్టణంలోని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.బీజేపీ అధికారంలోకొచ్చిన ఏడేండ్ల కాలంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ సంస్థలకు గుండు గుత్తాగా విక్రయిస్తుందన్నారు.క్విట్ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.సేవ్ ఇండియా...సేవ్అగ్రికల్చర్ పేరుతో చేపట్టనున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.మోడీ అనుసరిస్తున్న విధానాలు దేశ స్వావలంబనకు ప్రమాదకారిగా దాపురించినందున మోడీ గో బ్యాక్ నినాదంతో ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై ఈనెల 25 నుండి ఆగస్టు 9 వరకు అన్ని గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు, జిల్లానాయకులు పల్లెవెంకట్రెడ్డి, నాగారపు పాండు, వట్టెపు సైదులు, ఎలక సోమయ్యగౌడ్, ఆదినారాయణ, వెంకన్న,వీరబాబు, వీరస్వామి పాల్గొన్నారు.