Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని సిరి ఫంక్షన్హాల్లో ఆయన లబ్దిదారులకు రేషన్‌కార్డులు పంపిణీచేసి మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 3 లక్షల మందికి పైగా రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నా మన్నారు.మండలానికి 324 కొత్త రేషన్‌కార్డులు మంజూర య్యాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు, అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎంపీపీ గుండగాని కవిత రాములుగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటిసైదులు, మార్కెట్ కమిటీ చైర్మెన్ పులుసు యాదగిరి, వైస్‌ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలంయాదవ్, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ లక్ష్మీ, డిప్యూటీ తహసీల్దార్ పుష్ప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, మహమ్మద్ అలీ, సర్పంచులు నల్లు రాంచంద్రారెడ్డి,మామిడి వెంకన్న, లకావత్ యాకునాయక్,గుగులోత్ ఈరోజి, చందా వెంకన్న, మిరియాల అనితజనార్దన్, ఎంపీటీసీలు మట్టిపల్లి కవితాకుమార్, కేతిరెడ్డి లతావిజరుకుమార్రెడ్డి, మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య,కటకం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పేదోడి ఆకలితీర్చడానికి రేషన్‌కార్డుల పంపిణీ
నాగారం: రాష్ట్రంలో పేదోడి ఆకలితీర్చడానికి రేషన్‌కార్డులను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.మండలకేంద్రంలోని రహదారిబంగ్లాలో లబ్దిదారులకు ఎమ్మెల్యే రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఆకలిబాధలు తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా మూడులక్షల మందికి కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయిం చుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎంపీపీ కూరంమణివెంకన్న, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మెన్ గుండగాని అంబయ్య, తహసీల్దార్ బోరా కమలాద్రి, సర్పంచ్ కుంభం కర్నాకర్, ఆర్ఎస్ఎస్ మండల కోఆర్డినేటర్ పానుగంటి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, మండల నాయకులు పొదిల రమేశ్, యారాల నర్సింహారెడ్డి, ఈరేటి ఈదులకిరణ్, అంజి, దోమల బాలమల్లు,దొడ్డ ప్రేమయ్య, తరాల ఆంజనేయులు, మంచినీళ్ల మహేందర్,తీగుళ్ల ప్రశాంత్, వేల్పుల సాలయ్య పాల్గొన్నారు.