Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు
నవతెలంగాణ-గుండాల
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రంథాలయ ఆవరణలోఆ పార్టీ మండల సమావేశం పడకంటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహిొచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భతి,ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ,దళితులకు మూడెకరాల భూమి లాంటి వాటిని మరిచి ఇప్పుడు దళిత బంధు పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కూసుమాని హరిశ్చంద్ర,మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య,మండల కార్యవర్గ సభ్యులు జి మోహన్ రెడ్డి,పులి నర్సయ్య,వెంకన్న,శ్రీను తదితరులు పాల్గొన్నారు.