Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ - భువనగిరి
ముందు ఒక పథకం ప్రకటించడం ఎన్నిక తర్వాత ఆ పథకాన్ని అడ్రస్ లేకుండా చేయడం కేసీఆర్కు అలవాటేనని ఎన్నికల ముందు దళిత బందు ఎన్నికల తర్వాత అన్నీ బందు అని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మెన్ సిలారపు దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం హుజురాబాద్ పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో భువనగిరిలో రేణుకా ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి ,మాజీ మున్సిపల్ చైర్మెన్ బర్రె జహంగీర్ నివాసంలో ఆల్పాహార విందు చేశారు. దామోదర రాజనర్సింహకు భువనగిరిలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత బంధు పథకం ఒక పెద్ద మోసమని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గతంలో దళితులకు ఇచ్చిన భూములను వైకుంఠధామం రైతు వేదిక ప్రకతి వనం తదితర పేర్లమీద దౌర్జన్యంగా లాక్కున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా 180 ఎకరాల దళితుల భూమిని లాక్కున్నారన్నారు. ఉప ఎన్నికల వేళ కేసీఆర్ నోటి నుండి కొత్త పథకాలు పుట్టుకు రావడం కొత్తేమీ కాదని వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోకాపేట భూముల భూములను వేలంలో దక్కించుకున్న సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థలో కేసులు ఉన్నాయన్నారు. ఆహా భూముల వేలం పై ఎంక్వైరీ కమీషన్ను వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెరుకు శ్రీనివాసరెడ్డి, బక్కా జడ్సన్ , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, ఎంపిటిసి పాశం శివానంద్ ,కౌన్సిలర్స్ ఈరపాక నరసింహ, పడగల రేణుక ప్రదీప్, కైరంకొండ వెంకటేష్, వడిచర్ల లక్ష్మికష్ణ యాదవ్, ఎండీ సలావుద్దీన్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎండీ బబ్లూ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అద్యక్షులు ఎండీ అవేస్ చిస్తి, తదితరులు పాల్గొన్నారు.