Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ :అక్రమ సాదా బైనామాను రద్దు చేసి తమకు న్యాయం చేయండి ..లేదా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మాడ్గులపల్లి మండలం కన్నెకల్ గ్రామానికి చెందిన కొండూరు రామలింగం దంపతులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అక్రమంగా తమ భూమిని సాదాబైనామా దొంగ పత్రాలతో రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తికి చేశారని, అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కొండూరు రామలింగం దంపతులు కోరారు. గ్రామ శివారు లోని తమకు వారసత్వంగా వచ్చిన ,148 149 సర్వే నెంబర్ గల మూడు ఎకరాల 24 గంటల వ్యవసాయ భూమిని దాచారం గ్రామానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి యారమాదా చిన్నరామ్ రెడ్డి దొంగ పత్రాలు సష్టించి ఫోర్జరీ సంతకాలు చేసి సాదాబైనామా కింద తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రర్ చేసుకున్నాడని తెలిపారు. ఈ భూమి విషయం పై మిర్యాలగూడ ఆర్డీవోకు, ఎమ్మార్వో దష్టికి తీసుకుపోయామన్నారు. రెవెన్యూ అధికారులు రామ్ రెడ్డి కి సహకరిస్తూ తమకు న్యాయం చేయడం లేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకొచ్చామన్నారు.. భూమిపై అధికారులు సర్వే చేసి ఈ భూమి అక్రమంగా రిజిస్ట్రర్ అయ్యిందని కలెక్టర్కు ఆర్డీవో చెప్పినప్పటికీ జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు, ఫోర్జరీ సంతకాలకు పాల్పడ్డ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సాదాబైనామా రిజిస్ట్రేషన్ తీసివేసి తమ భూముని తమకు అప్పగించాలని, లేదా కారుణ మరణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.