Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి చెందడం కోసం బహుళార్ధ సేవా సహకార సంఘాలుగా త్వరలోనే ఏర్పడనున్నాయని డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మండల పరిధిలోని వంగపల్లి పీఏసీఎస్ పాలక వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాబార్డ్ సహకారంతో జిల్లాలోని అర్హత పొందిన సంఘాలకు రెండు కోట్ల వరకు రుణాలు అందించనున్నామన్నారు.అదేవిధంగా ఈ స్కీం కింద రుణాలు పొందిన సహకార సంఘాలు రుణాన్ని సక్రమంగా వినియోగించుకొని తిరిగి రుణాలు చెల్లించి అవార్డు అందించే వడ్డీ రాయితీ పొందాలని కోరారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అవసరమైన సేవలు అందించి ఆర్థిక వద్ధి చెందడానికి ,గోదాముల నిర్మాణం,రైస్ మిల్లు నిర్మాణం ,పెట్రోల్ బంకు నిర్మాణం పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ మదన్మోహన్,బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మణికాంత్ ,ఏజీఎం ఉదరు పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.