Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బొమ్మలరామరం
ఫైనాన్స్వారు టూవీలర్ వాహనాన్ని తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యచేసుకున్న సంఘటన మండలంలో బండకాడిపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండి హంజద్ (40) అనే వ్యక్తి మూడుచింతల పల్లిలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వద్ద ఫైనాన్స్ తీసుకుని టూ వీలర్ కొనుగోలు చేశాడు. విడతల వారిగా ఫైనాన్స్ చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఉపాధి లేక కొన్ని నెలలుగా ఫైనాన్స్ చెల్లించడం ఇబ్బందిగా మారింది. చెల్లింపు కాలం పొడిగిస్తూ వస్తుండడంతో కంపెనీ వారు తన ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకున్నారు. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మతుడికి భార్య, కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.