Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్వి ఎంవి.రమణ
నవతెలంగాణ - భువనగిరి
తెలంగాణ రాష్ట్రంలోని కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించి కల్లుగీత కార్మికుల అభ్యున్నతికి పాటు పడాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి.రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారంపట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశం సంఘం అధ్యక్షులు బొలగాని జయరాములు.గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంక్షేమం కోసం కొన్ని వేల కోట్లు నిధులు కేటాయిస్తూ కల్లు గీత కార్మికుల గౌడ కుటుంబాలకు సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో వెనుకబడిన గౌడ కుటుంబాలకు గీత కార్మిక కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి గీత కార్మికునికి మోటార్ సైకిల్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తాటి ఈత చెట్లు పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇస్తూ చెట్లు పెంచడానికి నీటి వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తాటి చెట్టు నుండి పడిన వారికి ఇచ్చే సర్టిఫికెట్ మెడికల్ బోర్డు నిబంధనను తొలగించాలని తాటి చెట్టు నుండి పడి మతి చెందిన గాయపడిన కుటుంబాలకు నెలలోపు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాములు జిల్లా కార్యదర్శి మాటూరు బాల్రాజ్ గౌడ్ మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు రాగీర్ కష్ణయ్యా. జిల్లా కమిటీ నాయకులు నెమిల మహేందర్. ఎరుకల బిక్షపతి. బామండ్లపెల్లీ బాలరాజు. దుపాటి వెంకటేష్. పబ్బతి మల్లేశం.కోల వెంకటేష్. పాండల మైశయ్య.కొక్కొండ లింగయ్య.బొడిగే బిక్షపతి.కోల కష్ణ.బాబ్బురి శ్రీను.పులి బిక్షం.పనుగుల్ల రమేష్. కొండా అశోక్.చెరుకు మల్లేష్ పాల్గొన్నారు