Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు అందుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలో దొంతిరి సోమిరెడ్డి ఫంక్షన్హాల్లో ఆలేరు ,ఆత్మకూరు, మోటాకొండూరు, మండలాలకు చెందిన లబ్దిదారులకు రేషన్‌కార్డులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా రేషన్ కార్డుల పంపిణీలో జాప్యం జరిగిందన్నారు. కరోనాతో ఎంతోమంది ఆప్తులను కోల్పోయామని ,థార్డ్వే వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు . జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 7,534 దరఖాస్తులకుగాను 5,934 కార్డులు ఎంపిక చేయబడ్డయని తెలిపారు . 2 లక్షల 19 వేల 6 వందల 39 కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబడుతున్నాయని చెప్పారు ..ఎస్ ఐ ఇంద్రేష్ అలీ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు . తహసీల్దార్ గణేశ్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీద రవీందర్ , వైస్ చైర్మెన్ గ్యాదపాక నాగరాజు, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మెన్లు వస్పరి శంకరయ్య, ఎరుకల సుధ హేమెందర్ , మోటాకొండూరు జెడ్పీటీసీ పల్లా వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశం, నార్మాక్స్ డైరక్టర్లు దొంతిరి సోమిరెడ్డి,లింగాల శ్రీకర్‌రెడ్డి , పీఏసీఎస్ చైర్మన్ మొగలగాని మల్లేశం, వైస్ చైర్మెన్ చింతకింది చంద్రకళ మురహరి .మూడు మండలాలకు చెందిన తహసీల్దార్లు ,డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు, ఎంపీటీసీలు, సర్పంచులు, రెవెన్యూ అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.