Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికీ ప్రభుత్వం రేషన్ కార్డు అందిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు మంగళవారం స్థానిక ఐశ్వర్య సాయి కళ్యాణ మండపం లో నకిరేకల్ మండలానికి చెందిన 407 మంది పట్టణానికి చెందిన 180 మంది లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అందించడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ప్రజల అభివద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ మాధ ధనలక్ష్మి నగేష్ గౌడ్, మార్కెట్ చైర్మెన్ నడికుడి ఉమరాణి వెంకటేశ్వర్లు, పీఏసీిఎస్ చైర్మెన్ పల్ రెడ్డి మహెంధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ మురారి శెట్టి ఉమా రాణి కష్ణ మూర్తి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నకిరేకల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కేతెపల్లి : రాష్ట్రంలో నిరుపేద కుటుంబాల ఆకలి తీర్చేందుకే ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్‌కార్డులను లబ్దిదారులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అభివద్ధిలో ఎక్కడ వెనకడుగు వేయకుండా నిధులు వెచ్చించిన ఘనత టీిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతు బీమా,రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, షాధిముబారక్, కేసీర్ కిట్టు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్ రెడి,్డ టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొప్పుల ప్రదీప్ రెడ్డి, గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.