Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూర్
ఆత్మహత్య చేసుక్న్ను నిరుద్యోగి పాక శ్రీకాంత్ కుటుంబాన్ని మంగళవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు షర్మిల పరామర్శించారు. కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. అక్కడి నుండి ఆమె ర్యాలీతో వచ్చి గ్రామ చౌరస్తాలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా మునుగోడు శాసనసభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ ద్వారా ఆమె దీక్షకు సంఘీభావం తెలిపి మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన రావాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిర శోభన్ మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇంటికో ఉద్యోగం ఏమైంది అని ఆమె ప్రశ్నించారు. అధికారం ఉన్నప్పుడే ఫామ్‌హౌస్ చక్కబెట్టుకోవాలనే తలంపుతో సీఎం కుటుంబం దోచుకొని దాచుకొని ఉందని విమర్శించారు. కేసీఆర్ సంక్షేమం అంటే గారడీ మాటలు తప్ప చేసిందేమిలేదన్నారు. విద్యార్థులు నిరుద్యోగులు, రైతులు దళితులు , మైనార్టీలను ముంచిన మోసగాడు కెేసీిఆర్ అని విమర్శించారు. రాబోయే రోజుల్లో వైయస్సార్ తెలంగాణ పార్టీ ని గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధులు రాఘవ రెడ్డి, భూమిరెడ్డి పిట్ట రామ్ రెడ్డి ,ఏపూరి సోమన్న, కమిటీ మెంబర్ అమత సాగర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొల్గూరి కేసరి సాగర్, సయ్యద్ ముస్తఫా, వివిధ జిల్లాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.