Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఉచిత రేషన్‌కార్డును అందజేసిందని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని వీకేఫంక్షన్హాల్లో లబ్ది దారులకు ఆయన రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.మండలానికి 168 నూతన రేషన్ కార్డులు మంజూర య్యాయన్నారు. అనంతరం కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అం,జేశారు.
మద్దిరాల : మండలంలోని చందుపట్ల గ్రామంలో సర్పంచ్ కస్తూరి రాణి శ్రీనివాస్‌రెడ్డి ఆహర భద్రతాకార్డులను లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో మొత్తం25 ఆహర భద్రతాకార్డులు మంజూర య్యాయన్నారు. ఈకార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శ్రీరాంరెడ్డి పాల్గొన్నారు.
మోతె : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమపథకాలను ప్రతి ఒక్కరూ సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.మండలంలోని రాఘవ పురంఎక్స్రోడ్డులో పీఎస్ఆర్ ఫంక్షన్ హాలులో తహసీల్దార్ యాదగిరి అధ్యక్షతన లబ్దిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ సుధారాణిపుల్లారెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ వెంకటాచారి, సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్దిదారులు పాల్గొన్నారు.
తిరుమలగిరి: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 263 మందికి కొత్త రేషన్ కార్డులను, 90 మందికి షాదీముబారక్, కల్యాణలక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మండలకేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్హాల్లో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజురజినిరాజశేఖర్, వైస్‌చైర్మెన్ ఎస్.రఘు నందన్‌రెడ్డి, మార్కెట్ చైర్మెన్ మూల అశోక్‌రెడ్డి, తహసీల్దార్ సంతోష్‌కిరణ్ పాల్గొన్నారు.