Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్
- కృష్ణానది నిర్వహణ - బోర్డు ఏర్పాటు, పరిణామాలపై రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు మరో ఉద్యమం చేపట్టబో తున్నట్టు తెలంగాణ జనసమితి వ్యవస్థాపకులు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిలా కేంద్రంలోని లయన్స్ క్లబ్ హాల్లో 'కష్ణానది నిర్వహణ, బోర్డు ఏర్పాటు, పరిణామాలు, నల్లగొండ జిల్లాలో కష్ణానదిపై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై' రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు గెజిట్ ఫిడరల్స్ఫూర్తికి విరుద్ధమన్నారు.అధికార వికేంద్రీకరణ చేయాల్సిన సర్కారే కేంద్రీకరణకు పూనుకోవడం దారుణమని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్ వల్ల తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థ మొత్తం కేంద్రం కనుసన్నల్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు.ఏడేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను సాధించలేక పోయారని ఆరోపించారు.శ్రీశైలం సొరంగమార్గాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్ల నుండి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.ఈ సమావేశంలో తెలంగాణ ఇంజనీరింగ్ ఫోరం నాయకులు డీ.లక్ష్మీనారాయణ, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, ప్రశాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, విద్యావంతులు వైద్యం వెంకటేశ్వర్లు, దర్శనం నర్సింహ, రామకృష్ణ, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పన్నాల గోపాల్‌రెడ్డి, మారెబోయిన శ్రీధర్, విద్యార్థి సంఘం నాయకులు ధీరావత్ రవినాయక్, బీసీసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారా యణ, పర్వతాలు, అనంతరెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.