Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ద్వారా అర్హులైన పేదలకే లబ్ది జరగాలని, ఆర్థికంగా ఉన్నవారు కార్డు పొందితే ప్రభుత్వానికి సరెండర్ చేసి మరో పేద కుటుంబానికి మేలు చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బుధవారంమున్సిపల్ కేంద్రంలోని ఎల్ఎన్గార్డెన్లో మండలానికి మంజూరైన 274 తెల్ల రేషన్ కార్డులను లబ్దిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనర్హులు కార్డులు పొందినట్టయితే అలాంటి వారిని గుర్తించి కార్డులు రద్దు చేయాలన్నారు. దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రతి పేదవానికీ కడుపునిండా అన్నం పెట్టేందుకు సీఎం కేసీఆర్ జనాభాకు సమాంతరంగా రేషన్‌కార్డులను మంజూరు చేస్తున్నారన్నారు. రేషన్ కార్డు ఉన్న పేదలకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సేవలు పొందే అవకాశముందన్నారు. కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉందని, అవసరమున్న చోట ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ ఆదేశించారు. అనంతరం నలుగురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, ఎంపీపీ దీటి సంధ్యారాణి సందీప్,జెడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ కంచర్ల అశోక్ రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, సివిల్ సప్లరు డీఎం గోపీకష్ణ, డీఎస్వో బ్రహ్మారావు, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, తహసీల్దార్ షేక్ అహ్మద్, ఆస్ట్ గాలయ్య, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ, ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి, సర్పంచులు మరిపెల్లియాదయ్య, పేలపూడి మధు, దండెబోయిన మల్లేష్, బత్తిని తిరుమలేష్, మార్కెట్ మాజీ వైస్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, గజ్జి మల్లేష్, జంగ శ్రీను, గనగాని నర్సింహ, వనం స్వామి, కూరేళ్ల కుమార స్వామి, కోమటి మత్స్యగిరి పాల్గొన్నారు.
శ్మశాన వాటిక ప్రారంభం
మండలంలోని పాటిమట్ల గ్రామంలో నిర్మించిన శ్మశాన వాటికను ఎమ్మెల్యే కిశోర్ కుమార్ ప్రారంభించారు. గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు దహన సంస్కారాలకు ఎన్నో ఇబ్బందులు పడుతుండటంతో శ్మశాన వాటికకు ఎకరం స్థలం కొనిచ్చిన ఎంపీటీసీ రచ్చకల్పనలక్ష్మీనర్సింహారెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ దండెబోయిన మల్లేష్, జడ్పీటీసీ గోరుపల్లి శారద, సింగిల్ విండో చైర్మెన్ కంచర్ల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.