Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని కొలనుపాక గ్రామంలో ఇటీవల గ్రామ పంచాయతీ నిధులు సుమారు రూ.10 లక్షలతో 2, 5, 10 వార్డుల్లో వేసిన సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ప్రజలు తెలుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నాసిరకంగా వేయడంతో కంకర లేచి గుంతలు పడి వర్షపు నీరు నిలిచిందని ఆగ్రామ కాంగ్రెస్ వార్డు సభ్యులు ఆరోపించారు. సీసీ రోడ్లు వేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీసీ రోడ్ల పనుల్లో అవినీతి చోటు చేసుకుంటుందని ప్రజా ప్రతినిధులు అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై సిసి రోడ్ల నిబంధనలు నాణ్యతలను తుంగలో తొక్కారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తూ నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సీసీరోడ్డుపై నీళ్లు నిలుస్తున్నాయి.
అమతం బాలరాజు, వార్డు సభ్యులు
ఆరు నెలల కిందట సీసీరోడ్లు నాసిరకంగా వేయడంతో వర్షానికి కొట్టుకుపోయి కంకరతేలింది. వర్షపు నీళ్లు నిలిచాయి. తిరిగి నాణ్యతగా రోడ్డు వేయాలి.