Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిశ్రమల శాఖలో.. చేయి తడపనిదే అందని రుణం
- ఎస్సీ, ఎస్టీలకు అందని రాయితీ సొమ్ము
జిల్లాలోని నిరుద్యోగ యువత స్వశక్తితో ఆర్ధికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహకారం అందిండానికి ఆయా కులాల సంక్షేమ శాఖలే కాకుండా జిల్లాలోని పరిశ్రమల శాఖ నుంచి అన్ని వర్గాల యువతకు సహకారం అందిస్తారు. అందులో భాగంగా ఈ శాఖ నుంచి ఎస్సీ, ఎస్టీ, నిరుద్యోగ యువతీ, యువకులకు రాయితీ ద్వారా తమ ప్రాజెక్టులకు రుణ సాయం చేస్తారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా నిరుద్యోగులకు ప్రతి యేటా రుణ సాయం చేస్తుంది...
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పరిశ్రమల శాఖ నుంచి రుణాలు తీసుకోవాలంటే లబ్దిదారుడు మొదట తాను ఎంచుకున్న ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు పనులు మొదలైన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ద్వారా బ్యాంకు కంన్సల్ట్తో కలిపి పరిశ్రమల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జిల్లా కమిటీ ద్వారా వాటిని ఆమోదింప చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి సంబంధిత లబ్దిదారుడికి రాయితీ సొమ్ము తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. అయితే ఏ ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నప్పటికీ పురుషులకు అయితే 35 శాతం, స్త్రీలకు 45 శాతం రాయితీ సొమ్మును అందజేస్తారు.
రాయితీ సొమ్ము కోసం ఎదురు చూపులు
సుమారు మూడేండ్లుగా జిల్లా పరిశ్రమల శాఖ నుంచి రాయితీ రుణాలు తీసుకున్న నిరుద్యోగ యువతకు రాయితీ సొమ్ము విడుదల కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ఎస్సీ లబ్దిదారులకు నవంబర్ 2018 నుంచి 921 మందికి రూ.28,07,80,297 రాయితీ సొమ్ము రావాల్సి ఉంది. వీరేగాకుండా గిరిజన నిరుద్యోగ యువతకు మే 2019 నుంచి 872 మంది లబ్దిదారులకు రూ.25,97,81,248 సొమ్ము రావాల్సి ఉంది. వాస్తవంగా ప్రతి లబ్దిదారుడికీ ఆరు నెలల నుంచి ఏడాది వరకు తనకు రావాల్సిన రాయితీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఏండ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
అక్కడ ప్రతి పనికీ ఓ రేటు..
జిల్లా పరిశ్రమల శాఖలో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి పనిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేతులు తడపకపోతే పని జరగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి తిరిగినా ఏ అధికారీ స్పందించడం లేదని చెబుతున్నారు. ప్రతి రుణ రాయితీలో 10 శాతం వరకు చేతులు తడిపితే తప్ప రాయితీ సొమ్ము విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. లబ్దిదారులు ప్రారంభించిన ప్రాజెక్టు విచారణకు సంబంధిత ఏరియా ఇన్చార్జి అధికారి వస్తే ఆయనకు కూడా ఎంతో కొంత ముట్టజెపాల్సి వస్తోందని పేరు చెప్పని కొందరు ఆరోపిస్తున్నారు. తిరిగి తిరిగి విసిగిపోయిన లబ్దిదారులు జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ జిల్లా అధికారికి ఫిర్యాదు చేస్తే గాని ఏడాదిలో మంజూరు చేసిన సందర్భం ఉంది. ఇక్కడ అధికారులే అతిపెద్ద పైరవీకారులుగా మారినట్టు ఆరోపణలున్నాయి.
మొదటిపేజీ తరువాయి..
మొదలైన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ద్వారా బ్యాంకు కంన్సల్ట్తో కలిపి పరిశ్రమల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన జిల్లా కమిటీ ద్వారా వాటిని ఆమోదింప చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి సంబంధిత లబ్దిదారుడికి రాయితీ సొమ్ము తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. అయితే ఏ ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నప్పటికీ పురుషులకు అయితే 35 శాతం, స్త్రీలకు 45 శాతం రాయితీ సొమ్మును అందజేస్తారు.