Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్టును నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని జాతీయ రహదారిపై మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. అరెస్టుచేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దగోని రమేశ్‌గౌడ్, బర్రె నరేశ్, మంగ ప్రవీణ్, మహంకాళి రాజేశ్‌ఖన్నా, బోయ వెంకట్, శివగౌడ్, అజరు, భార్గవ్, లింగస్వామి, సంపత్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ :మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తలపెట్టిన చలో మునుగోడు కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేసి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కొరడమే తప్పు అన్నట్టు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కనీస ప్రొటో కాల్ ఇవ్వకుండా హేళన చేసేలా మంత్రి జగదీష్ రెడ్డి ప్రవర్తించడం దారుణమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కొర్పూరి సైదులు,వెలువర్తి యాదగిరి, గుద్దేటి యాదయ్య, ఎంపీటీసీ మందుల శ్రీశైలం, మాజీ సర్పంచి సుర్వి నర్సింహ్మ,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పెద్దగోని రమేష్,నాయకులు పల్చమ్ సత్యం,ఊదరి నర్సింహ్మ, ఆవుల యేసు దాసు పాల్గొన్నారు.
భువనగిరి: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్టును నిరసిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట గిరీష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణకేంద్రంలో నల్లబ్యానర్ పట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అమనాతూల్ల,యువజన కాంగ్రెస్ ఆలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సుమన్ రెడ్డి ,ఎన్ ఎస్.యూ.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగా చందు, బింగి శివ,నగరం ప్రవీణ్, దాసరి మధు,కొండొజు సాయి పాల్గొన్నారు.