Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీడబ్ల్యూతో డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్న ఆఫీసర్లు
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కాడు. ఆలేరు మండలం కొలనపాక గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 424,425,426,440, గల 23 ఎకరాల 29 గుంటల జీపీ లే అవుట్ 2008 లో వెంచరు చేశారు. స్విస్ లైఫ్ గ్రీన్ ఆవెన్యూలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ అనే మధ్యవర్తి ద్వారా సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్లాట్లకు 10 వేలు డిమాండ్ చేయగా 20 వేలకు ఒప్పందం కుదుర్చుకుని రిజిస్ట్రేషన్ కోసం వెంచర్ ఓనర్ డాక్టర్ సత్యం అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పక్కా స్కెచ్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అలాగే హైదరాబాద్ లోని సబ్ రిజిస్ట్రర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
గతంలోనూ ఏసీబీ దాడులు....
30మే 2019లో ఇదే కార్యాలయంపై ఏసీబీ అధికారులు రెండు రోజులపాటు దాడులు నిర్వహించారు. అప్పట్లో యాదగిరిగుట్ట ప్రాంతంలో ఏసీబీ దాడుల విషయం సంచలనంగా మారింది. అప్పటినుండి ఇక్కడి ఆఫీసులో జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా ఉన్నట్టు స్థానికంగా చర్చ ఉంది. ఎన్నిమార్లు ఇక్కడ ఏసీబీ దాడులు నిర్వహించిన ఆఫీసర్లల్లో మార్పు మాత్రం రావడం లేదు. దీనికి కారణం ప్రధానంగా డాక్యుమెంట్ రైటర్లేనని ఆరోపణలు ఉన్నాయి. గుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు సంపన్నులు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరి దగ్గర అ డబ్బులు డిమాండ్ చేస్తూ కోట్లకు పడగలెత్తారు. అయితే ముఖ్యంగా ఈ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తుల ద్వారా. సెటిల్ మెంట్లు పర్వం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి క్షేత్ర అభివద్ధికి పరుస్తున్న నేపథ్యంలో ఇక్కడ రియల్ వ్యాపారం పుంజుకుంది. దీంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇదివరకు, ఇప్పుడు జరిగిన ఏసీబీ దాడులుతో నైనా పరిస్థితి చెక్ పడుతుందో లేదోఅని ఇంకా అనుమానాలు వీడడం లేదు.