Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి
నవతెలంగాణ - నూతనకల్
మెగా పల్లె ప్రకృతివనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతివనం పనులను పరిశీలించి మాట్లాడారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి హరితహారంలో భాగంగా మొక్కలను నాటాలన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని సూచించారు. అనంతరం జాతీయ రహదారి - 365 రోడ్డుకిరువైపులా నాటుతున్న మొక్కలను పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కకూ ట్రీగార్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ జి.సురేష్, మిరియాల గ్రామ సర్పంచ్ కనకటి సునీతవెంకన్న, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న, వైస్ ఎంపీపీ జక్కి పరమేష్, ఎంపీడీవో ఇందిరా, ఎంపీవో మోహన్రావు, ఏపీవో శ్రీరాములు, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.