Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి
నవతెలంగాణ - అర్వపల్లి
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి కోరారు. శనివారం బొల్లంపల్లి - జాజిరెడ్డిగూడెం గ్రామాల్లో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి మాట్లాడారు. ప్రతి మొక్కరూ ట్రీ గార్డులు ఏర్పాటు చేసి నీరందించాలని కోరారు. ఆయన వెంట ఏపీడీ యాదయ్య, ఎంపీపీ మన్నె రేణుక, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్, ఎంపీడీవో విజయ, ఎంపీవో సురేష్, ఏపీవో శైలజా, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు
మండల కేంద్రంలో సాగుతున్న వై జంక్షన్ నిర్మాణ పనులను కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి పరిశీలించారు. వర్షానికి నీళ్లు తమ ఇండ్ల చుట్టూ నిలుస్తున్నాయని జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్యాదవ్ ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు.
తుంగతుర్తి :మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్లకిరువైపులా నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని సింగారంతండ, వెలుగుపల్లి, తుంగతుర్తి గ్రామాల వరకు రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి మాట్లాడారు. పచ్చదనం - పరిశుభ్రత కార్యక్రమాల నిర్వహణకు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ హరితహారం నర్సరీ రిజిస్టర్ పెట్టాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్త సేకరించాలని, చెత్తను కంపోస్టు షెడ్లకు తరలించాలని కోరారు. ప్రతీ నర్సరీలకు గేట్ బోర్డు ఉండాన్నారు. అనంతరం వెలుగుపల్లి, తుంగతుర్తి రహదారికిి దగ్గరలో మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీవో యాదయ్య, ఏపీడీ రాజు, ఎంపీపీ గుండగాని కవితరాములుగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తహసీల్దార్ రామ్ ప్రసాద్, ఎంపీడీవో లక్ష్మి, ఏపీవో వెంకన్న, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నల్లు రాంచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు సంకినేని రవీందర్రావు, వెలుగుపల్లి సర్పంచ్ మామిడి వెంకన్న, పంచాయతీ కార్యదర్శులు మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేటరూరల్:నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి కోరారు. శనివారం మండలంలోని మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా బాలెంల గ్రామం నుంచి రాజనాయక్ తండా వరకు 365 నెంబర్ జాతీయ రహదారి రోడ్డుకిరువైపుల నాటిన మొక్కలను పరిశీలించి మాట్లాడారు. ప్రతి మొక్కకూ ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీపీఓ యాదయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్ రావు, ఎపీఓ వెంకన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.