Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
వెంచర్లలో గ్రామపంచాయతికి ఇచ్చిన 10 శాతం భూములను కాపాడాలని సీపీఐ(యం) మండల కమిటీ సభ్యులు చిరిక సంజీవరెడ్డి కోరారు. చౌటుప్పల్ మండలం పంతంగి జాతీయ రహదారిపై ఆది బాలాజీ యాజమాన్యం వెంచర్ చేసి,గ్రామపంచాయతీ క్10 శాతం భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమిలో 2 కోట్ల విలువ చేసే ఎకరం భూమిని చైతన్య మఠం ట్రస్టు కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఎంపీఓ అంజిరెడ్డి కి,పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామవసరాలకు ఉపయోగించాల్సిన భూమిని ధార్మిక సంస్థలకు అప్పజెప్పడం అభ్యంతరకరమని అన్నారు. చైతన్య మఠంకు ఇస్తున్నట్టు పాలకవర్గం తీర్మానం చేసినట్టు తెలిసిందని వాపోయారు. ప్రభుత్వ భవనాలు,రైతులకు ఉపయోగపడే విధంగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటివి ఏర్పాటు చేయాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా రక్షించాలని కోరారు.ఈ విషయంపై అఖిలపక్షం మీటింగ్,గ్రామసభ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో పంచాయతీ వార్డు సభ్యులు కాకి సుందర్, నాయకులు నక్క లింగస్వామి, రొడ్డ భగత్,లింగయ్య,రొడ్డ శివకుమార్ తదితరులు ఉన్నారు.