Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య
నవతెలంగాణ -కేతెపల్లి
రైతు కార్మిక వ్యవసాయ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోడీ ప్రభుత్వ.పై 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారత్ రక్షణ దిన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య పిలుపు నిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాసంఘాల సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల నుండి ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిందన్నారు. లాభాల బాట లో నడుస్తున్న పరిశ్రమలను చౌకధరకు కార్పొరెట్ శక్తులకు కట్టబెట్టడం మూలంగా కోట్లాది మంది కార్మికులు వీధిన పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వ్యవసాయ కార్మికులు, రైతులు అసంఘటిత కార్మికులు తమ శ్రమతో దేశ సంపదను సష్టిస్తున్నా శ్రమకు తగిన ఫలితం రాకపోవడంతో అర్ధాకలితో జీవితాలు గడుపుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను బానిసత్వంలోకి నెట్టడానికి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తూ 9న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా అధ్యక్షులు బోజ్జ చిన వెంకులు.రాష్ట్ర కమిటీ సభ్యులు లగిశేట్టి శ్రీనివాస్.రైతు సంఘం జిల్లా నాయకులు కోట లింగయ్య, సీఐటీయూ నాయకులు జి అశిర్వాదం, నాయకులు వంగూరి వెంకన్న, ఆవ్వారి కిరణ్, రవితేజ, టి జ్యోతి పాల్గొన్నారు.