Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.45.28 లక్షల వ్యయంతో నూతన మెగా పల్లె ప్రకతి వనానికి శంకుస్థాపన
నవతెలంగాణ-కోదాడరూరల్
గ్రామాలలో ఆరోగ్యకరమైన వాతావరణం అందించడమే లక్ష్యం అని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.బుధవారం మండలంలోని రెడ్లకుంట గ్రామంలో మెగాపల్లెప్రకృతివనం పనులను ఆయన కలెక్టర్వినరుకృష్ణారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో పచ్చని చెట్లు పెంచి సుందరవనంగా తీర్చిదిద్దాలని తెలిపారు.చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణ కాలుష్యరహిత హరిత తెలంగాణ కోసం స్పష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.మొక్కలు నాటడం ప్రజలందరి భాగస్వామ్యం కావాలన్నారు.నాటిన ప్రతి మొక్కలు సంరక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.భావితరాలకు ఆస్తుల కన్నా కాలుష్య రహిత వాతావరణం ఇవ్వడమే నిజమైన ఆస్తి అని తెలిపారు.గ్రామగ్రామాన వైకుంఠదామం, డంపింగ్‌యార్డులను ప్రభుత్వం నిర్మించిందన్నారు.రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మెగాపల్లెప్రకృతివనాన్ని ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితరాధారెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, సర్పంచ్ సాధినేని లీల అప్పారావు, మార్కెట్ కమిటీ చైర్మెన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, జెడ్పీటీసీ కష్ణకుమారి శేషు, వైస్‌ఎంపీపీ మల్లెలరాణి బ్రహ్మయ్య, ఏపీడీ పెంటయ్య పాల్గొన్నారు.