Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేకవిధానాలను విడనాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు హెచ్చరించారు.బుధవారం మండలకేంద్రంలో సీఐ టీయూ,వ్యవసాయకార్మికసంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఎంపీపీ గుండగాని కవితా రాములుగౌడ్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ ను ఉపసంహరించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐఎం మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయకార్యదర్శి పల్లా సుదర్శన్, సీఐటీయూ మండల నాయకులు ఓరుగంటి అంతయ్య పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి
నూతనకల్ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం మండలకేంద్రంలోని ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి నివాసగహంలో ఎంపీపీకి నల్లచట్టాలను రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు నల్లాచట్టాలు కార్మిక హక్కులను కాలరాస్తున్న చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, సీఐటీయూ నాయకులు బొజ్జ శ్రీను, రైతుసంఘం నాయకులు తొట్లఅచ్చయ్య , చీమల లింగయ్య, భువనగిరి లింగయ్య పాల్గొన్నారు.
చింతలపాలెం: నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సర్పంచ్‌కు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు సైదులు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు కందుల సుందర్,మల్లేశ్వర్‌రెడ్డి, జంగల పుల్లయ్య, మదార్, బన్‌కి, బిచ్చాలు పాల్గొన్నారు.