Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలుకు కషి చేస్తున్న
- మండల పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఎంపీ వెంకట్రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
'నాకు ప్రొటోకాల్ అవసరం లేదు.రాష్ట్రంలోని ప్రజల అభివద్దే నాకు ముఖ్యం.వాసాలమర్రికి ముఖ్యమంత్రి వచ్చిన కూడా నన్ను పిలవలేదు.నా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అభివద్ధి కార్యక్రమాలు చేస్తున్న కూడా ముఖ్యమంత్రి కనీసం పిలువక పోవడాన్ని పట్టించుకోను' అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డివెంకట్ రెడ్డి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.మండలంలో పలు ప్రభుత్వ శాఖలను సమీక్ష చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు.గ్రామీణ రహదారులను పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పుబట్టారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక జాతీయ రహదారి-65పై ప్రమాదాలు పెరిగాయి.దీన్ని గుర్తించి ఎల్బీనగర్ నుండి దండుమల్కాపురం వరకు ఆరు లైన్ల రోడ్డును రూ.600 కోట్లతో మంజూరు చేయించానని తెలిపారు. సంగేం నుండి చౌటుప్పల్ వరకు రూ.18 కోట్లతో రోడ్డు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుండి తెేచ్చామన్నారు. అన్నారు. ఈ రోడ్డులకు టెండర్లు వారం రోజుల్లో పిలుస్తారని తెలిపారు. అదేవిధంగా చేనేత కార్మికులకు 600 ఆసు మిషన్లు మంజూరు చేయించానని పేర్కొన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ప్లై ఓవర్ రోడ్డు కోసం రూ.85.25కోట్లు మంజూరు చేయించానని తెలిపారు. జీఎంఆర్ సంస్థ పెరిగిన ట్రాఫిక్ మేరకు ఆరు లైన్ల వేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా వినకుండా కోర్టును ఆశ్రయించిందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున కోర్టుకు వెళ్తానని అన్నారు.
- హెచ్ ఎండీఏ నిధులు ఇవ్వాలని సర్పంచులుప్లకార్డుల ప్రదర్శన
సర్వసభ్య సమావేశంలో మండల సర్పంచ్ లు గ్రామాలకు నిధులు ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సర్పంచులు తెలిపిన మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్దతు పలికారు. హెచ్ఎండీఏ పరిధిలోని మండలాలకు నిధులు ఇచ్చినట్టయితే చౌటుప్పల్ మండలం కూడా నిధులు వచ్చేలా కమిషనర్ తో మాట్లాడతానని తెలిపారు. మండలానికి మూడు కోట్ల నిధులు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యుత్తు అధిక లోడుతో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించాలని సూచించారు. 90 ట్రాన్స్ఫాÛర్మర్లు అవసరం ఉన్నాయని అధికారులు తెలిపారు. వెంటనే విద్యుత్ బోర్డు డైరెక్టర్ మదన్మోహన్ ఫోన్ ద్వారా మాట్లాడి వారం రోజుల్లో 50 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని కోరారు.మొదటిసారిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. సర్పంచులు, ఎంపీటీసీలు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, జడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీవో రాకేష్ రావు, తహసిల్దార్ గిరిధర్, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు ,తదితరులు పాల్గొన్నారు.