Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ-నల్లగొండ
మహిళలు లేనిదే సమాజ మనుగడ లేదని, మహిళామణులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ సమాజానిదేనని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.మంగళవారం కనగల్ మండలంలో నిర్వహించిన ఐద్వా మహాసభలలో ఆయన మాట్లాడారు. మహిళలను రెండవ పౌరురాలిగా చూస్తున్నారని ఏ చిన్నపాటి అవకాశం దొరికినా పసిపిల్లల నుండి వద్ధుల వరకు అఘాయిత్యాలు జరుగుతు న్నాయన్నారు.నేడు అన్ని రంగాలలో మహిళలు ముందున్నారన్నారు.తన ప్రతిభను చాటుతూ దేశ పురోగాభివద్ధికి పాటుపడు తున్నారన్నారు.జనాభాలో సగభాగం ఉన్న మహిళల అభివద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు సరిగా ఉండడంలేదన్నారు.ఏ ఒక్క చిన్న పథకమైనా నేడు ప్రకటించడం లేదని విమర్శించారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదాయం లేక, పౌష్టికాహారం, రక్తహీనతకు గురై అనేకమంది ప్రాణాలు సైతం వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కచ్ఛితంగా పార్లమెంటు ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.సీఎంకేసీఆర్ డ్వాక్రా రుణాలను రద్దు చేయాలని కోరారు.గ్రామాల్లో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధిపనులను 300 రోజులకు పెంచాలన్నారు.రోజుకు రూ.600 కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు.మహాసభల ప్రారంభసూచకంగా ఐద్వా జెండాను వేముల సాయమ్మ ఎగరవేశారు.అనంతరం నూతన మండలకమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షురాలుగా పుల్కరం సుజాత, ఉపాధ్యక్షులుగా కోటేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా సుల్తానా, సహాయ కార్యదర్శిగా వేముల సాయమ్మ, గుండెబోయిన భాగ్య, మొండికత్తి యమున, తొరకొప్పుల రజిత, పాలక్షురి శ్రీలత, నెల్లుట్ల అరుణతో పాటు 12మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.