Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి షరతులు లేకుండా ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షెడ్యూలు కులాల సమగ్ర అభివద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడి శంకర్, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి సైదులు, ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ సందర్శించి మాట్లాడారు. ఈనెల 15లోపు హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికీ రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బొజ్జ దేవయ్య, మహిళ అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఏర్పుల శ్రవణ్ కుమార్, వి హెచ్ పి ఎస్ జిల్లా కన్వీనర్ రెడ్డి మాస్ ఇందిరా, భాగిడి స్వప్న, బోగరి రవి, కొత్తపల్లి తిరుమలేష్, బొజ్జ నవీన్, బొజ్జ కష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.