Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందాల ప్రమీల
నవతెలంగాణ- నకిరేకల్
మహిళల హక్కుల రక్షణ కోసం ఐద్వా ఉద్యమి స్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కందాల ప్రమీల పేర్కొన్నారు. బుధవారం స్థానిక నర్రా రాఘవరెడ్డి భవనంలో ఐద్వా పట్టణ మహాసభ పన్నాల శశికళ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై పెరుగుతున్న హింస, వివక్ష, అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించడం ఫలితంగానే గహహింస, నిర్భయ, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలను అమలు చేస్తోందన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. మహిళల అభివద్ధి కోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షురాలిగా కొత్త రాజేశ్వరి, కార్యదర్శిగా చెన్నబోయిన నాగమణి, ఉపాధ్యక్షులుగా పన్నాల శశికళ, సంఘం విజయ, సిహెచ్ లక్ష్మమ్మ, సహాయ కార్యదర్శిగా రాంపల్లి ఇందిర, ఎస్ మంగమ్మ, సుధా, కోశాధికారిగా జానమ్మలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు బహురోజు ఇందిర, ప్రతినిధులు ఎస్ జ్యోతి, జి సుజాత, సుమ, సిహెచ్ నాగ లక్ష్మి, శైలజ, ఆర్ లక్ష్మి, యశోద పాల్గొన్నారు.