Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
నవతెలంగాణ- వలిగొండ
వలిగొండ మండల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 67మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అదేవిధంగా లబ్దిదారులకు పోచంపల్లి పట్టుచీర, దోవతి పంపిణీచేశారు. తన సొంత నిధుల నుండి మండలానికి కేటాయించిన అంబులెన్సు మెయింటెనెన్స్ కింద ఒక సంవత్సరానికి గాను ఖర్చుల కింద రూ.3లక్షలు ఎంపీడీవో గీతారెడ్డి ఎంపీపీ నూతి రమేష్‌కు అందజేశారు. త్వరలో మండలానికి ఒక్కో గ్రామ పంచాయతీకి రూ 25 లక్షలు రానున్నాయని తెలిపారు .తన కు ప్రభుత్వం ఇచ్చే రూ.5 కోట్లు నిధులను మండలానికి అభివద్ధి పనులకు కేటాయిస్తానని తెలిపారు .ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మ అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలరాజు, సింగిల్విండోచైర్మెన్్ సురకంటి వెంకటరెడ్డి, ఎంపీటీసీలు పాలుచం రమేష్ యశోద, భాగ్యమ్మ ,స్థానిక సర్పంచ్ లలిత, తహసీల్దార్ నాగలక్ష్మి ,మార్కెట్ చైర్మెన్ కవిత, మత్స్యగిరి గుట్ట చైర్మెన్ ముద్దసాని కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్ఐ కర్ణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.