Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షలు మాటూరి బాలరాజ్ గౌడ్
నవతెలంగాణ -మోటకొండూర్
ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు గౌడ్ బంధు పథకాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజ్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెంలో ఆ సంఘం గ్రామ అధ్యక్షుడు బొడిగె భిక్షపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పోరాటంలో కల్లు గీత కార్మికులు, యువకులు ముందు వరుసన నిలిచి పోరాడారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బోలగానీ జయరాములు గౌడ్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, ప్రతి సొసైటికీ పదెకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో కల్లూరు సత్యనారాయణ గౌడ్, ఉప సర్పంచ్ కోమ్మగాని ప్రభాకర్ గౌడ్,బోడిగే కష్ణయ్య గౌడ్, పోతగానీ వెంకటేశ్వర్లు గౌడ్, బుడిగే సుదర్శన్ గౌడ్,యాదగిరి,మల్లయ్య, చిన్న సుదర్శన్, రాములు, సోములు, చంద్రయ్య, ప్రేమ్ కుమార్, సత్తయ్య, వెంకటేష్, అమరేందర్, మహేందర్ పాల్గొన్నారు.