Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల నిర్లక్ష్యంతో..80 శాతం పూర్తిగా ఎండిన మొక్కలు
- బోరు వేశారు..కనెక్షన్ మరిచారు..
- రూ.లక్షలు వృథా
నవతెలంగాణ-మర్రిగూడ
గ్రామాలు పచ్చదనంతో నిత్యం కళకళలాడాలని సంకల్పంతో ప్రభుత్వం పల్లెప్రకతి వనంతో పాటు ప్రతి మండలానికి బహత్ పల్లెప్రకతివనాన్ని ఏర్పాటు చేసింది. మండలంలోని సరంపేటలో ఏర్పాటు చేసిన వనంలో మొక్కలకు సరైన సమయంలో నీరందించకపోవడంతో అవి బతకడం లేదు.సర్వే నం 280,281 లో పదెకరాలలో 44 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది.అందులో 31,000 మొక్కలను నాటాల్సి ఉండగా ప్రస్తుతం 17,000 మొక్కలను అధికారులు హడావుడిగా నాటించారు.కానీ సకాలంలో నీరు అందించకపోవడంతో 80 శాతం మొక్కలు పూర్తిగా ఎండి పోయాయి.రెండువారాల కింద బోరు వేశారు.మోటర్ తెచ్చినప్పటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో పనులు పూర్తి చేయలేదు.వర్షాలు మొహం చాటేయడంతో మొక్కలకు గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా నీరు పోస్తున్న అవి సరిపోవడం లేదు. రిజర్వాయర్,పలు గ్రామాల ట్యాంకర్ల ద్వారా నీటిని అందించిన ఫలితం లేకుండాపోయింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ డీఆర్డీఏ పీడీ కేంద్ర కమిటీ సభ్యుల నుండి మండల స్థాయి వరకు అధికారులు పర్యవేక్షించి పనులను పరిశీలించారు.సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కానీ మొక్కలకు నీరు అందించే మార్గం ఎవరు చూపలేదు.పలు శాఖల అధికారులకు ముందుచూపు లేకపోవడంతోనే ఉన్న మొక్కలు, నాటిన మొక్కలను కాపాడుకోలేక నష్టం వాటిల్లిందని పలువురు చెప్పకనే చెబుతున్నారు.ఎవరి నిర్లక్ష్యం కారణంగా మొక్కలు ఎండిపోయాయని ఆయా శాఖల అధికారులు ప్రశ్శ్నించు కోవాల్సిన అవసరం మిగిలి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మొక్కల పెంపకం ఖర్చు ఇలా అన్నీ లెక్క కట్టుకుంటూ పోతే ఈ భారం ఎవరి పైన పడుతుంది, ఎవరు భరిస్తారు. ఇంత కష్టపడి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన సంతృప్తి లేకుండా పోయిందని సర్పంచ్ వెంకటమ్మ మధుకర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ కనెక్షన్ ఇప్పించి నీరు అందేలా చూసి మొక్కలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.