Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యతలు స్వీకరించిన గంటల్లోనే మరొకరి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
- నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా పాలనాటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజకీయరంగ ప్రవేశానికి సహకరించారనే ఆరోపణలతో తహసీల్దార్ పొడపంగి రాధను పెద్దఅడిశర్లపల్లి మండలానికి బదిలీ వేటు విధితమే.నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా పీఏపల్లి మండలంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.దేవదాస్‌ను బదిలీ చేస్తూ ఈనెల 10వ తేదీన ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం ఎం.దేవదాస్ నార్కట్ పల్లి తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే దేవదాసును బదిలీ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదల్పూర్ మండలానికి చెందిన తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పలనాటి శ్రీనివాస్‌రెడ్డిని నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.పొడపంగి రాధ మధ్యంతర బదిలీ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది.తాజాగా నాటకీయ పరిణామాలతో గంటల వ్యవధిలోనే ఇద్దరు తహసీల్దార్లను ఒకే మండలానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం.. బాధ్యతలు స్వీకరించడం జరిగిపోవడంతో రెవెన్యూ డిపార్టుమెంట్లో కీలకభూమిక పోషించే తహశీల్దార్ల బదిలీలు సాధారణ ఉద్యోగుల కంటే సర్వ సాధారణంగా మారిపోయాయని పెద్దఎత్తున చర్చ నీయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో తహసీల్దార్ల సాధారణ బదిలీలు లేకపోవడం జిల్లాలో ఇద్దరు తహసీల్దార్ల బదిలీలు చర్చా విషయం మరువకముందే తాజాగా సిద్ధిపేట నుంచి మరో తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించడం నాటకీయ ఫక్కీలో బదిలీలు సాగు తున్నాయని ప్రజలు చర్చించు కుంటున్నారు.
తహసీల్దార్‌గా పాలనాటి శ్రీనివాస్‌రెడ్డి
నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా పాలనాటి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్‌రెడ్డికి డిప్యూటీ తహసీల్దార్ మురళీమోహన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మంగమ్మ, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.