Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయఅధ్యక్షుడు కృష్ణయ్య
నవతెలంగాణ-దామరచర్ల
ప్రభుత్వం బీసీల కోసం బీసీబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కష్ణయ్య డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో శుక్రవారం ఆయన ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.బీసీబంధు పథకం కోసం బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.వచ్చే ఎన్నికల్లోగా బీసీలందరికి ఈపథకం కింద రూ.10 లక్షలు ఇస్తేనే ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు.దళితబంధు కూడా హుజురాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలని కోరారు.అదికూడా వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు కింద రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు.ఎన్నికలోగా అందరికి రూ.10 లక్షలు ఇవ్వాలని,ఆ తర్వాత ఇస్తారన్న నమ్మకం లేదన్నారు.ఎన్నికలలోపు ఒక్కో బీసీకి రూ.10 లక్షలు ఇవ్వకపోతే అధికార పార్టీకి చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరిం చారు. ఏడున్నరేండ్లుగా బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ల ద్వారా ఏ ఒక్కరికీ రుణాలివ్వ లేదన్నారు. కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదన్నారు.ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న రిజర్వేషన్లు సక్రమంగా అమలుకావడం లేదని ఆరోపిం చారు.ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశం, అశోక్, జీడయ్యయాదవ్, చంటి పాల్గొన్నారు.