Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్లు, ఇనుపస్తంభాలు,
- తరచుగా విద్యుత్ కోతలు
- విన్నవించినా పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ -ఆలేరురూరల్
ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరాను నాణ్యతగా అందిస్తున్నామని గొప్పలు చెబుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో అమలు కావడంలేదు. చిన్న గాలి వీచినా గంటల కొద్ది విద్యత్ కోతలు విధిస్తున్నారు. ఇండ్ల మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని అధికారులకు విన్నవించినా పరిష్కారానికి నోచుకోవడంలేదు. మండలంలో ని కొల్లూరు గ్రామంలో దాదాపు 30 ఇండ్ల కిందట ఏర్పాటు చేసిన ఇనుప విద్యుత్ స్తంభాలు ఉండడంతో గత మూడు నెలల క్రితం ఇనుప స్తంభం ఎక్కి గ్రామ పంచాయతీ సిబ్బంది కరెంట్ షాక్కు గురైన సంగతి తెలిసిందే. అదేవిధంగా శర్బన పురం గ్రామంలో ఇండ్లమధ్యలో ట్రాన్స్ఫార్మార్ ఉండడంతో ఎప్పుడేప్రమాదం జరుగుతోందనని భయాందోళన చెందుతున్నారు. పల్లె ప్రగతి లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ తరపున నివేదిక అందించిన విద్యుత్ అధికారులు మాత్రం ఎక్కడా పూర్తిస్థాయిలో పనులు పూర్తిగా చేయలేదని సర్పంచులు, ప్రజలు ఆరోపిస్తున్నారు .ఇండ్ల మధ్య నుండి ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలి
సిరిగిరి ఐలమ్మ శర్భనాపురం
20 ఏండ్లుగా విద్యుత్ అధికారులకు ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని ఎన్నిసార్లు నివేదించినా పట్టించు కోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి
ఇనుప స్తంభాలు తొలగించాలి
టీఆర్ఎస్ మండల కార్యదర్శి జనగాం వెంకట పాపిరెడ్డి, కొల్లూరు
కరెంట్ షాక్కు గురయ్యే ఇనుప స్తంభాలను వెంటనే తొలగించాలి. గతంలో గొర్రెలు, మనుషులు చనిపోయిన సంఘటన గ్రామంలో నెలకొంది. ఇప్పటికైనా ఇనుప స్తంభాలను, ఇండ్ల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలి.