Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
- మండల సర్వసభ్య సమావేశానికి అధికారుల డుమ్మా
- అసిస్టెంట్లను పంపడంతో ఎమ్మెల్యే ఆగ్రహం
నవతెలంగాణ-మోత్కూరు
మండల సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టడం పట్ల తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అధికారులూ ఓసారి మీ ముఖం చూపించండి...దండి పెట్టి పోతా' అని అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ దీటి సంధ్యారాణిసందీప్ అధ్యక్షతన నిర్వహించారు. సభకు వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టి వారి అసిస్టెంట్లను పంపడంతో తనకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు పనిలేక మండల సభకు వచ్చామా అంటూ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. విద్యుత్, ఎంఈవో, ఐసీడీఎస్ సీడీపీవో, వెటర్నరీ ఏడీతో పాటు ఇతర అధికారులు మూడు నెలలకోసారి జరిగే మండల సభకు కూడా రాకుంటే ప్రజాప్రతినిధులు సమస్యలను ఎవరికి చెప్పుకుంటారని, ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ఎంపీడీవో మెతక వైఖరి కారణంగా అధికారుల పనితీరులో నిర్లక్ష్యం కనిపిస్తుందని, ఎంపీడీవో కఠినంగా ఉంటే మండల పరిషతకు రాని అధికారులంతా సస్పెండ్ అవుతారని హెచ్చరించారు.
గ్రామాలభివద్ధికి కషి చేస్తా: ఎమ్మెల్యే
గ్రామాలభివద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని, పల్లె ప్రగతిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్మశానవాటికలు, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకతి వనాల నిర్మాణాలను సర్పంచులు, ఎంపీటీసీలు ముందుండి సకాలంలో పూర్తి చేయించాలని ఎమ్మెల్యే కోరారు. మోత్కూరులో నిర్మిస్తున్న ప్రాంతీయ పశువైద్యశాల భవనం నిర్మాణానికి అదనంగా రూ.10 లక్షలు కేటాయిస్తానని తెలిపారు. మోత్కూరుకు ట్రాన్సకో ఏడీఈ, ఏఈ, అడ్డగూడూరుకు ఏఈ పోస్టు మంజూరు కోసం విద్యుత్ శాఖ మంత్రి, ట్రాన్స్ కో సీఎండీ దష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రూ.10 కోట్లతో దాచారం, పొడిచేడు గ్రామాలకు మూసీనదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించాలని సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఈసమావేశంలో జెడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, తహసీల్దార్ షేక్ అహ్మద్, సర్పంచులు రాంపాక నాగయ్య, పేలపూడి మధు, అండెం రజిత, దండెబోయిన మల్లేష్, ఎలుగు శోభ, ఉప్పల లక్ష్మీ, మరిపెళ్లి యాదయ్య, వర్రె కవిత, ఫైళ్ల విజయ, తిరుమలేష్, ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి, అధికారులు పాల్గొన్నారు.