Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొద్దిపాటి వర్షమొచ్చినా చెరు వులను తలపిస్తున్న రహదారులు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
నవతెలంగాణ-పెద్దవూర
అధికారులు,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం గ్రామీణ రహదారులు. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని చిత్తడిచిత్తడిగా మారు తున్నాయి.దీంతో ప్రయాణం నరకంగా మారింది.మండలంలోని మారుమూల గ్రామాలు నేటికీ రహదారులు మరమ్మతుకు నోచని దుస్థితి నెలకొంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వర్షం వస్తే చాలు భయం గుప్పిట్లో మగ్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇక అత్యవసర పరిస్థితుల్లో ,గ్రామాల్లో డయేరియా, మలేరియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబలినట్టయితే గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు 104, 108 వాహనాలు సైతం వెళ్లలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.రోడ్లన్నీ బురద మయం కావడం వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండలంలో రోడ్ల దుస్థితి
ఉమ్మడి పెద్దవూర మండలంలోని పోతు తనూరు మీదుగా పులిచర్ల,నాయినవాని కుంట నుండి పర్వేదుల,పెద్దగూడెం స్టేజీ నుంచి కొత్తలూరు,సాగర్ పైలాన్ నుంచి మూలతండా,హాలియా నుంచి నాగార్జునసాగర్‌కు వెళ్లే రహదారి తునికి నూతల నుంచి రాజవరం వెళ్లే రహదారి ,సాగర్ నుంచి నాగార్జున పేట,సాగర్ నుంచి జమ్మనకోట మీదుగా చింతలపాలెం రోడ్లు 20 ఏండ్ల కింద వేశారు.రోడ్లన్ని గుంతలమయంగా మారడంతో కొద్దిపాటి వర్షమొచ్చినా గుంతల్లో నీరు నిలుస్తుంది.దీంతో ప్రజలు ఈ రహదారుల గుండా వెళ్లాలంటనే భయాందోళన చెందు తున్నారు.కొంత మంది ప్రయాణికులు గుంతల్లో పడి గాయాలవ్వడంతో ఆస్పత్రిలో చేరుతున్న పరిస్థితి ఉంది.నెరటోనిగూడెం ,కుంకుడు చెట్టుతండా రోడ్డు వర్షానికి చెరువులను తలప ిస్తున్నాయి.ఏడేండ్లుగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టడం లేదు.మూడు కిలోమీటర్ల దూరం నరకయాతన పడుతున్న పరిస్థితి ఉంది.బురద ఉండడంతో ద్విచక్రవాహనాలు, ఆటోలు రావడం లేదు.
రోడ్ల పై రావాలంటే భయమేస్తుంది
గార్ల పాటి శ్రీనివాస్‌రెడ్డి ...పులిచర్ల
రోడ్డుపై మోకాలు లోతుకు పైగా గుంతలు,పొలాల నుంచి జాలువారే నీళ్లు,పెద్ద పెద్ద వెడల్పు గుంతలు ఉండడంతో వర్షం నీళ్లకు గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి.దీంతో వాహనదారులు కింద పడి గాయపడుతున్నారు.ఈ రహదారి 20 ఏండ్ల కింద వేశారు.వెంటనే మరమ్మతులు చేపట్టాలి.