Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ పురపాలికను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పునరుద్ఘాటించారు. పట్టణ ప్రధానకూడళ్లలో సుందరీ కరణ పనులను చేపడుతున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా రామచంద్రగూడెం వై జంక్షన్లో మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్‌తో కలిసి వాటర్ ఫౌంటేన్‌ను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోకి ప్రవేశించేవారికి రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ప్రధానంగా రాత్రి వేళల్లో కనువిందు చేస్తుందన్నారు.ఈ కార్యక్ర మంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ కుర్ర విష్ణు, మున్సిపల్ కమిషనర్ (ఎఫ్ఏసీ)సాయిలక్ష్మి, కౌన్సిలర్లు మాలోతురాణి శ్రీను, సంజాతనవాబ్, ఉదరుభాస్కర్, సాధినేని స్రవం శ్రీనివాస్, గోవింద్‌రెడ్డి, స్వర్ణలత వజ్రం, సలీం, చిలుకూరి రమాదేవిశ్యామ్, నాయకులు సైదిరెడ్డి, రేపాల రమేశ్, ఇమ్రాన్, యేసు, శామ్యూల్ పాల్గొన్నారు