Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నార్కట్పల్లి
మహిళ కడుపులో నుంచి ఏడు కిలోల కణితి ఆపరేషన్ చేసి తొలగించిన సంఘటన సోమవారం నార్కట్పల్లి కామినేని ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మహిళ (51) రెండేండ్ల నుంచి కడుపు ఉబ్బరంతో బాధ పడుతోంది. వైద్యం కోసం ఈ నెల 2వ తేదీన నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు కణితి ఉందని నిర్ధారించారు. ఆపరేషన్ చేసి మహిళ కడుపులో నుంచి ఏడు కిలోల కణితిని తొలగించారు. ప్రస్తుతం మహిళ కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.