Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడుచర్ల
యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పత్తేపురం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై విజరు ప్రకాష్ వివరాల ప్రకారం.. ఫత్తేపురం గ్రామానికి చెందిన పగిడిమర్రి సైదులుకు అనూష, సుధా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరి చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో అనూష(22)ను పెంచుకుంటామని పెదనాన్న అయిన పగిడిమర్రి నాగేష్ తీసుకెళ్లారు. పెండ్లి వయస్సు వచ్చినా చేయకుండా కూలి పనులు చేయిస్తూ ఆమెను బానిసలా మర్చారు. జీవితంపై విరక్తి చెందిన అనూష ఆదివారం పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. బాబారు పగిడిమర్రి విజరు, పెదనాన్న కుమారుడు అంజి తన అక్క పట్ల అమర్యాదగా ప్రవర్తించి ఆమె మృతికి కారకులయ్యారంటూ మృతురాలి చెల్లలు సుధా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ఏరియాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.