Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-మునగాల
ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్మి మల్లు నాగార్జునరెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని కలకోవ గ్రామంలో నిర్వహించిన పార్టీ గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడారు. పాలకుల విధానాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిచిందన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తారా స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నా హామీ ఏమైందని ప్రశ్నించారు. పార్టీ నాయకులు అనంతు గురువయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శి దేవరం వెంకట్‌రెడ్డి, దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.