Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయప్రతినిధి
జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌గా విశిస్ట సేవలందించిన వైద్యాధికారి నర్సింహ సేవలు ప్రశంసనీయం.మెడికల్ కాలేజీ జిల్లాకు మంజూరైన తర్వాత సూపరిండెంట్‌గా బాధ్యతలు నిర్వహించి మెరుగైన సేవలందించారు.వైద్య విధాన పరిషత్ నుంచి డీఎంఏ విభజన చేయడంలో కూడ చాకచక్యంగా వ్యవహ రించారు.ఆయన చేసిన సేవలను జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది.అందులో భాగంగానే ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ వైద్యాధికారిగా హోంమంత్రి మహిమూద్ అలీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కలెక్టర్ ప్రశాంత ్జీవన్పాటిల్ సహకారంతో హాస్పిటల్లో చిన్న పిల్లల ప్రత్యేకవైద్యశాల, మెటర్నటీ వైద్యశాలలకు విద్యుత్ సమస్యను తొలగించడానికి రూ.6లక్షల నిధులతో ప్రత్యేక ట్రాన్స్ఫారం, రూ.5లక్షల నిధులతో పవర్‌గ్రిడ్ ఏర్పాటు చేశారు. బయటి రోగుల సౌకర్యం కోసం ఆ బ్లాక్‌లో సుమారు రూ.18లక్షల నిధులతో వసతులు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రత్యేకప్లాంట్ను ఏర్పాటు చేశారు.రోగుల వసతి కోసం 200 మంచాలు ఏర్పాటు చేసి, రోగుల వరకు ఆక్సిజన్ అందేలా ప్రతిమంచం వరకు ప్రత్యేక ఆక్సిజన్ పైప్‌లైన్ వేయించారు.అంతేగాకుండా కేవలం కార్పొరేట్ హాస్పిటల్లోనే జరిగే ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు జిల్లా వైద్యశాలలో చేశారు.ఈ ఒక్క ఆపరేషన్ విలువ సుమారు రూ.70వేల నుంచి రూ.1.50లక్షల వరకు ఖర్చవుతుంది.మాతా శిశు డెలివరీలు ఇక్కడే చేసేలా చర్యలు తీసుకున్నారు.ప్రతినెలా సుమారు 700 నుంచి 800 కేసుల వరకు కృషి చేశారు.హాస్పిటల్లో ఉన్న వైద్యుల సేవలను సద్వినియోగం చేసుకుంటూ ఐసీయూ కేసులన్ని ఇక్కడే హాస్పిటల్లో చేర్చుకుని మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో హాస్పిటల్లో సులభ్ కాంప్లెక్స్, రోగులకు సహాయకులుగా ఉండే వారికోసం ప్రత్యేకబ్లాక్ను ఏర్పాటు చేశారు.