Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
తండ్రిని హత్య చేసిన ఘటనలో కొడుకును సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.అతని నుండి రక్తం మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్ చేశారు.డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మందడి బుచ్చిరెడ్డి మద్యానికి బానిసై ప్రతిరోజూ తాగి ఇంటికి వచ్చేవాడు.విషయం అందరికీ తెలిసింది. దీంతో అతని కుమారుడు నరేష్‌రెడ్డి వివాహం చేసు కునేందుకు ఎవరూ అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.ఈ క్రమంలో విసుగు చెందిన నరేష్‌రెడ్డి ఎలాగైన తన తండ్రిని చంపాలని నిర్ణయించు కున్నాడు.ఈ నెల 12న రాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన తండ్రితో గొడవకు దిగాడు.ఇంట్లో ఉన్న ప్లాస్టిక్కుర్చీతో కొట్టడమే కాకుండా తీవ్రంగా గాయపరిచాడు.చికిత్స నిమిత్తం బుచ్చిరెడ్డిని నల్లగొండ పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మృతి చెందాడు.మృతుని భార్య సునంధ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పరారీలో ఉన్న నిందితుడు ఈ నెల 15న రాత్రి సమయంలో ఇంటి వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేశారు.కోర్టుకు రిమాండ్ చేశారు.చాకచక్యంగా వ్యవ హరించి నిందితున్ని అరెస్టు చేసిన టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డిని డీఎస్పీ అభినందించారు.ఈ సమావేశంలో టౌన్ సీఐ చంద్ర శేఖర్‌రెడ్డి, రూరల్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, పీఎస్సైరాజశేఖర్ పాల్గొన్నారు.